*నరసరావుపేట* : నరసరావుపేట పట్టణంలోని మున్సిపల్ ఆఫీసులో నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి పేదలందరికీ ఇల్లు, నవరత్నాలు అందుచేత విషయమై అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. గుంటూరు జిల్లా ఇంఛార్జి మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథ రాజు గారు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ వివరాలను, సమస్యాత్మకంగా ఉన్న భూముల గురించి అధికారులు వివరించారు. ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు అందించాలని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అధికారులు ఎక్కడా లోటుపాట్లు లేకుండా పూర్తి చెయ్యాలి. నియోజకవర్గం మొత్తంగా 13000 ఇళ్లకు స్థలాలు పంపిణీ చేస్తున్నాం. ప్రజలతో సమన్వయం చేసుకోవాలి. అలాగే నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. కోటప్ప కొండ వద్ద జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు త్వరగా పూర్తి చెయ్యాలి. వినుకొండ ప్రాంత అభివృద్ధికి తక్కువ నిధులు కేటాయించడం పై ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు అధికారులను ప్రశ్నించి..ఈ ప్రాంత అభివృద్ధికి కూడా పెద్ద పీట వెయ్యాలని ఆదేశించారు. రానున్న రెండేళ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. మిగిలి ఉన్న సమస్యలను సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకు వెళ్ళి పరిష్కరిస్తాం. వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ నీటి సరఫరా జరగబోతుంది. ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఆర్డీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి, ఆయా మండలాల ఎమ్మార్ ఓ లు, మండల అధ్యక్షులు, ప్రజలు పాల్గొన్నారు.
నవరత్నాలు అందుచేత విషయమై అధికారులతో సమీక్ష
• PRAJA VIMOCHANA